త్రినిటీ విద్యాసంస్థల్లో వందేమాతరం పూర్తి గేయ నిత్య గానం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలోని త్రినిటీ విద్యాసంస్థల్లో వందేమాతరం గీత రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి విద్యార్థి వందేమాతరం గేయాన్ని పూర్తిగా కంఠస్థం చేసుకుని ఆలపించేలా విద్యాసంస్థల యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి ప్రతిరోజూ ఉదయం పాఠశాలలో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జిని మంజుల తెలిపారు.