చంద్రబాబుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
చంద్రబాబు అధికారంలోకి వస్తే వానలు పడవంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శాస్త్రీయత లేని విమర్శలు చేస్తూ ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. జలాశయాలు నీటితో కళకళలాడుతున్న ఆధారాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వర్షాభావ వాదనలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘాటుగా తిప్పికొట్టారు.