సోషల్ మీడియాలో లగ్జరీ రీల్స్ పోస్ట్ చేసిన మహిళ ఇంటిలో భారీ చోరీ

రిపోర్టర్: మహేష్ స్థలం: Kanyakumari

కన్యాకుమారి జిల్లాలో సోషల్ మీడియాలో విలాసవంతమైన రీల్స్ పోస్ట్ చేసిన యూట్యూబర్ మధుమిత ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆమె భర్త వినోద్ కుమార్తో కలిసి షాపింగ్కు వెళ్లిన సమయంలో దొంగలు వెనుక తలుపు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో దాచిన నూట ఇరవై తులాల బంగారం, వజ్రాభరణాలు, యాభై వేల నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. రోజూ తమ ప్రయాణాలు, షాపింగ్లను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేయడమే ఈ దొంగతనానికి కారణమని పోలీసులు తెలిపారు.