నేపాల్ వరదల్లో అద్భుతం: పది రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

రిపోర్టర్: హరి స్థలం: World

నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పది రోజుల తర్వాత త్రిశూలీ ప్రాజెక్ట్ సొరంగం నుండి ఒక చైనా పౌరుడిని, నువాకోట్‌లో 64 ఏళ్ల మహిళను నేపాల్ సైన్యం సురక్షితంగా కాపాడింది. ఈ విపత్తులో 1,300 మందికి పైగా మరణించగా, 5,000 మంది గల్లంతయ్యారు. భారత, నేపాల్ సైన్యాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తూ ప్రాణాలను కాపాడుతున్నాయి.