హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో ఉన్న హెచ్‌ఎండీఏ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనలో సంస్థ బాధ్యత ఎంతో కీలకమని, ప్రతి అధికారి, ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.