బాపట్లలో భారీ వర్షం, జాతీయ రహదారిపై విరిగిపడిన సూచిక బోర్డు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: బాపట్ల
బాపట్లలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 216ఏ జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన పెద్ద సూచిక బోర్డు విరిగిపడింది. ఆ సమయంలో వాహనాలేవీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో బైపాస్‌లో ఓ వైపు మాత్రమే వాహనాల రాకపోకలకు అనుమతించారు. పలుచోట్ల చెట్లు విరిగి తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.