రాజాపేటలో ఘనంగా గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడవ రోజు శ్రీ స్వామి వారికి ప్రధాన అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో మాశెట్టి శ్రీనివాసులు శోభారాణి దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు సమర్పించారు. మహిళలు మంగళ హారతులతో స్వామివారిని కీర్తించగా, రాత్రి వేళ భజన కార్యక్రమాలు, తీర్థప్రసాద పంపిణీ వైభవంగా సాగాయి.