నెల్లూరులో రాజకీయ పరిణామం: వైకాపాను వీడి తెదేపాలో చేరిన యాభై కుటుంబాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
ఇందుకూరుపేట మండలంలోని మైపాడుపాలెం గ్రామానికి చెందిన వైకాపా మాజీ ఎంపీటీసీ కూనం గారి రమణయ్యతో పాటు మరో యాభై కుటుంబాలు ఆ పార్టీని వీడి తెదేపాలో చేరాయి. నెల్లూరులోని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యాలయంలో ఆమె సమక్షంలో వీరంతా తెదేపా కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే స్వయంగా పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.