కుప్పంలో రూ.45 కోట్లతో అభివృద్ధి పనులకు అధికారిక అనుమతులు
రిపోర్టర్: సతీష్
స్థలం: చిత్తూరు
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో సుమారు రూ.45 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. స్థానిక అవసరాలు మరియు ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటూ చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రతిపాదించిన మొత్తం 489 పనులకు ప్రణాళిక శాఖ స్పష్టమైన ఆమోదం తెలపడంతో, ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన పనులు త్వరలోనే శరవేగంగా ప్రారంభం కానున్నాయి.