బాలికలకు ఆత్మరక్షణ నైపుణ్యాలు: 214 ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణనిర్వహణపై కలెక్టర్ వెల్లడి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పశ్చిమ గోదావరి
బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలను అలవర్చడమే ప్రధాన లక్ష్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 214 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 42 వేల మంది విద్యార్థినులకు ప్రత్యేకంగా 20 రోజుల పాటు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పశ్చిమ గోదావరి వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులు క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ఎదుర్కొనేలా అవసరమైన శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.