ప్రేమించి పెళ్లి చేసుకొని మొహం చాటేసిన భర్తపై వివాహిత నిరసన
రిపోర్టర్: నరేష్
స్థలం: మచిలీపట్నం
మచిలీపట్నంలో ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకుని ఆపై మొహం చాటేస్తున్నాడంటూ భర్త ఫణికుమార్ ఇంటి వద్ద జయలక్ష్మి అనే వివాహిత శనివారం నిరసన తెలియజేసింది. ఆగస్టు 30న విజయవాడ దుర్గగుడిలో వీరు వివాహం చేసుకున్నట్లు బాధితురాలు తెలిపింది. కొన్ని రోజులుగా తనను ఒంటరిగా వదిలేసి పరారైన భర్త కోసం ఆమె ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న ఇనగుదురుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని పంపి దర్యాప్తు చేపట్టారు.