రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను తాకట్టు పెట్టడం ప్రమాదకరం: అరవింద్ ధర్మపురి
రిపోర్టర్: సురేష్
స్థలం: నిజామాబాద్
దేశంలో అభివృద్ధి సాగుతున్న తరుణంలో కొందరు అవాస్తవ ప్రచారాలతో అలజడి సృష్టిస్తున్నారని Arvind Dharmapuri మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బాహ్య శక్తులతో చేతులు కలపడం దేశ సార్వభౌమత్వానికే పెను ముప్పని ఆయన హెచ్చరించారు. విదేశీ శక్తుల కనుసన్నల్ లో జరిగే కుట్రలు ప్రమాదకరమని స్పష్టం చేశారు. మరోవైపు అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన ఎనిమిది నెలల బాలుడు అడుప రాజిత కుమారుడి వైద్యం కోసం సహాయం అందజేశారు.