అసంపూర్తి అభివృద్ధి పనులతో అల్లాడుతున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు

రిపోర్టర్: మహేష్ స్థలం: నెల్లూరు

ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలోనూ పనులు మందకొడిగా సాగుతున్నాయని, తాగునీరు, సాగునీరు, వైద్యం వంటి మౌలిక వసతులు అందక అల్లాడిపోతున్నామని బాధితులు వాపోతున్నారు.