నెల్లూరులో పేదల అసైన్డ్ భూముల స్వాహా

రిపోర్టర్: గోపి స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో పేదలకు చెందాల్సిన అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమయ్యాయి. రీసర్వే పేరుతో రెవెన్యూ అధికారుల సహకారంతో పెద్దలు ఈ భూములను కైవసం చేసుకున్నారు. ఏకంగా 50 ఎకరాలకు పైగా భూమిని ఇతరుల పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేసి చేతులు మార్చారు. ఈ భారీ భూ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని ఆత్మకూరు ఆర్డీవో పావని వెల్లడించారు.