స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు కళా వెంకటరావు పిలుపు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

చీపురుపల్లిలో జరిగిన తెదేపా సమావేశంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కీలక దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.