హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ బడా గణేశుడు గంగమ్మ ఒడికి చేరాడని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద క్రేన్ నంబర్ 4 వద్ద మహా గణపతి నిమజ్జన కార్యక్రమం అత్యంత ప్రశాంతంగా ముగిసిందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది అరవై తొమ్మిది అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిగా గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర వేలాది మంది భక్తుల జయజయద్వానాల నడుమ కనుల పండువగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.