అనపర్తి ఆసుపత్రి అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

రిపోర్టర్: Devendra Reddy స్థలం: అనపర్తి

అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆర్వో ప్లాంట్లను ఆయన ప్రారంభించి, రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు.

త్వరలోనే ఐపీహెచ్ఎల్ ల్యాబ్, నూతన భవనాలను అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదనపు నిధులను మంజూరు చేసి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని ఆధునీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.