ఎన్‌టీఏ ప్రక్షాళనతో పాటు నీట్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలన్న ఏబీవీపీ

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అవకతవకలను అరికట్టేందుకు సంస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరేంద్ర సింగ్ సోలంకి డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీలను నివారించడానికి శాశ్వత సిబ్బందిని నియమించాలని, జవాబుదారీతనం పెంచాలని ఆయన సూచించారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం నీట్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలని ఏబీవీపీ తరఫున ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.