జూరాల ధర్నాకు పిలుపునిస్తే మాజీ మంత్రి హౌస్ అరెస్ట్

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

జూరాల ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నాకు ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగునీరు అందక రైతులు పడుతున్న గోసపై గొంతెత్తుతున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని తిరుమల హిల్స్‌లో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.