గణనాధుని సన్నిధిలో పులకించిన పల్లెర్ల భక్తి పారవశ్యం
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామంలో టైగర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో గౌడ సంఘం యువజన నాయకులు మరియు విగ్రహ దాత నోముల మల్లేష్ గౌడ్, వారి సతీమణి నాగమణి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టైగర్ గ్రూప్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.