స్థానిక ఎన్నికల్లో సీట్లు ఎక్కువగా అడగొద్దు నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: Andhra Pradesh
జనసేన పార్టీ పెట్టి పన్నెండేళ్లు దాటిన తరుణంలో స్థానిక ఎన్నికల వ్యూహంపై పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు ఎక్కువగా అడగవద్దని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలపడిందని ఆశించిన శ్రేణులకు ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.