మహారాష్ట్రలో ఎంపీఎస్సీ పోస్టుల భర్తీపై దేవేంద్ర ఫడ్నవీస్ కీలక ప్రకటన

రిపోర్టర్: నరేష్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్యను రికార్డు స్థాయిలో పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంపీఎస్సీ సంస్కరణలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేస్తే ఆబ్జెక్టివ్ పరీక్షా విధానాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ముఖ్యంగా గ్రూప్ సీ పోస్టుల భర్తీని భారీగా చేపడతామని స్పష్టం చేశారు.