చేనేత పింఛన్లకు జీఎస్టీ కొరత ముప్పు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
వైకాపా ప్రభుత్వ హయాంలో తెచ్చిన జీఎస్టీ నిబంధన వల్ల చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందడం లేదు. ముడిసరకు కొనుగోలు బిల్లులు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు అర్హత కోల్పోతున్నారు. ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ తదితర ప్రాంతాల్లోని సొంత మగ్గం నేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిబంధనను సడలించాలని చేనేత సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.