ఉంగుటూరులో పిచ్చికుక్క బీభత్సం: బాలుడితో సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: మహేష్ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కాకర్లమూడిలో ఆదివారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. రెండేళ్ల బాలుడితోపాటు మరో ఎనిమిది మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామస్థులపై వరుస దాడితో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఆ కుక్కను హతమార్చారు. బాధితులను వెంటనే ఆటోలో తాడేపల్లిగూడెంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.