నాయనమ్మను తలుచుకుని భావోద్వేగానికి గురైన ప్రముఖ నటి శ్రద్ధా కపూర్

రిపోర్టర్: సతీష్ స్థలం: ముంబై

ఈథా చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో తన నానమ్మను తలుచుకుని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కథ విన్న వెంటనే తన నాయనమ్మ ఎంతో గర్వపడతారనే ఆలోచన వచ్చిందని ఆమె మీడియా సమావేశంలో తెలిపారు. మహారాష్ట్ర జానపద కళాకారుల కష్టాలను ప్రతిబింబించే ఈ చిత్రంలో నటించడం తన కెరీర్లోనే ఎంతో గర్వకారణమని, తన మహారాష్ట్ర మూలాల గురించి ప్రస్తావిస్తూ ఆమె ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.