శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల డిమాండ్పై టీటీడీ కీలక వివరణ

రిపోర్టర్: రాము స్థలం: తిరుమల

శ్రీవారి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్పై వస్తున్న సందేహాలకు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టతనిచ్చింది. కోటాతో పోలిస్తే డిమాండ్ తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటోందని, అత్యంత తక్కువ సమయంలోనే కోటా పూర్తవుతోందని టీటీడీ వెల్లడించింది. వర్చువల్ క్యూ అనేది అధిక ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే సాంకేతిక విధానమేనని తెలిపింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని భక్తులు ఎవరూ నమ్మవద్దని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.