అంతరిక్ష రంగంలో మరో ఘనత: విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్18

రిపోర్టర్: సతీష్ స్థలం: శ్రీహరికోట

అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక విజయాన్ని అందుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించినట్లు వెల్లడించారు. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపిన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-03 నిర్దేశిత ప్రవేశ కక్ష్యలోకి చేరిందని స్పష్టం చేశారు. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ ప్రయోగంతో నావిక్ సేవలు మరింత బలోపేతం కానున్నాయని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి.