తిరువూరులో మురసు తుపాను ప్రభావం: అధికారులను అప్రమత్తం చేసిన ఆర్డీఓ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తిరువూరు
మురసు తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా తిరువూరు డివిజన్ లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్డీఓ ఏ. కుమార్ చెరువులు, వాగులను పరిశీలించారు. ఈ మేరకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలని, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు ఆర్డీఓ తెలిపారు.