సెమీకండక్టర్ విధానాన్ని సవరించిన ఒడిశా ప్రభుత్వం
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఢిల్లీ
ఒడిశా రాష్ట్రంలో సెమీకండక్టర్ విధానాన్ని మూడోసారి సవరించినట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించిందని చెప్పారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆమోదించిన ప్రాజెక్టులకు సంబంధించి మూలధన వ్యయంపై అదనంగా ఇరవై ఐదు శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని ఆయన వెల్లడించారు.