ఇన్‌స్టా రీల్స్‌తో యువతను పెడదారి పట్టిస్తున్న నెల్లూరు రౌడీషీటర్లు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో రౌడీషీటర్లు సామాజిక మాధ్యమాలను ఆయుధంగా మలుచుకుంటూ ఇన్స్టాగ్రాం రీల్స్ ద్వారా అమాయక యువతను పెడదారి పట్టిస్తున్నారు. ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూ నేర ప్రవృత్తి వైపు యువకులను ఆకర్షిస్తున్న ఈ ముఠాల వలలో పడి విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న వైనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.