భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్టలో రికార్డు స్థాయి నిత్య ఆదాయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు ఆదివారం భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు నలభై ఐదు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, ప్రసాద విక్రయాలు, నివాస వసతులు తదితర అన్ని విభాగాల ద్వారా మొత్తం ముప్ పై మూడు లక్షల అరవై ఏడు వేల డెబ్బై ఆరు రూపాయల ఆదాయం లభించింది.