హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని ఘట్కేసర్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్దలను ఎదురించి కులాంతర వివాహం చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మనస్పర్థల కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. తల్లి మృతి చెందడంతో రెండేళ్ల కవల పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.