ఉన్నత విద్యలో భారీ ఖాళీలు: ఎస్బీఐ నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడి

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

దేశంలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్యతో పాటు విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెరిగినప్పటికీ, కేంద్ర నిధులతో నడిచే ప్రముఖ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ డేటా ప్రకారం మంజూరైన పోస్టుల్లో సుమారు ముప్పై నాలుగు శాతం ఖాళీలు ఉన్నట్లు తేలిందని, ముఖ్యంగా ఐఐఐటీలు మరియు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్ర రూపం దాల్చిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.