పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన వైసీపీ నేత గౌతంరెడ్డి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Andhra Pradesh
రాష్ట్రంలో పోలీసుల తీరుపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన సంఘటనలో పోలీసుల లాఠీచార్జ్ మరియు తోపులాటలో వైసీపీ నేత గౌతం రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు ఆయనను నెట్టేయడంతో ఒక్కసారిగా సొమ్మసిల్లి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు మరియు కార్యకర్తలు ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.