అమెరికాలో వైభవంగా శ్రీ శివపార్వతుల కల్యాణ మహోత్సవం: అట్టహాసంగా వేడుకలు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఫ్రిస్కో
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా ఆధ్వర్యంలో అమెరికాలోని ఫ్రిస్కో నగరంలో శ్రీ శివపార్వతుల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండిపెండెన్స్ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు డల్లాస్ మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు, భక్తులు హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ ఆధ్యాత్మిక వేడుక అమెరికాలో భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మ విలువలను చాటిచెప్పింది.