విజయవాడ భవానీపురంలో కాశీ శైలిలో అద్భుతమైన మహా రౌద్ర గణపతి మండపం

రిపోర్టర్: హరి స్థలం: విజయవాడ

విజయవాడ భవానీపురంలో లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కాశీ దివ్యధామాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన 25 అడుగుల మహా రౌద్ర గణపతి మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇసుక శిల్పాలు, అష్టాదశ శక్తిపీఠాల ప్రతిరూపాలు, పుర్రెల నమూనాలు, కాలభైరవ స్వామి సంచారాల థీమ్‌తో రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకునేందుకు నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.