జైపుర్ లో వినాయక పెయింటింగ్స్ తో ప్రత్యేక ప్రదర్శన
రిపోర్టర్: రాము
స్థలం: రాజస్థాన్
రాజస్థాన్‌లోని జైపుర్ ఆర్టిస్ట్ వినయ్ త్రివేది వినాయక చవితి వేడుకల సందర్భంగా 51 ప్రత్యేక గణేశ్ పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. గత 35 ఏళ్లుగా కాన్వాస్‌లపై వివిధ రూపాల్లో గణనాథుని చిత్రాలను ఆయన చిత్రీకరించారు. బాల్యం నుంచి యవ్వన రూపం వరకు విభిన్న భంగిమల్లో ఉన్న ఈ చిత్రాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చెవిటి, మూగ పిల్లలకు కూడా ఆయన చిత్రకళను నేర్పిస్తున్నారు.