ఢిల్లీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు: మరోసారి ఎల్లో అలర్ట్ జారీ

రిపోర్టర్: రాము స్థలం: India

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం కురిసిన వర్షాలకు విమానాశ్రయం, ప్రధాన రహదారులు జలమయమై ట్రాఫిక్ స్తంభించింది. వాతావరణ శాఖ తాజాగా మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షాల వల్ల జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.