విజయనగరం జిల్లాలో ఎన్నికలకు పటిష్ట భద్రత: ఎస్పీ దామోదర్ వెల్లడి

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో ఆదివారం జరగనున్న ఎన్నికల కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు సుమారు 1500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఓటర్లు ఎవరి ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.