ఏపీకి భారీ పెట్టుబడి: తిరుపతి శ్రీసిటీలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు

రిపోర్టర్: సునీల్ స్థలం: Tirupati

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త మైలురాయి నమోదైందని, తిరుపతి జిల్లా శ్రీసిటీలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు లభించాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐషర్ మోటార్స్ సంస్థ సుమారు రెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ మెగా ప్రాజెక్టును నిర్మిస్తోందని, దీని ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.