అమరావతి రైల్వే లైన్ ఎలైన్మెంట్ లో మార్పులు: తాడికొండ వద్ద ప్రధాన స్టేషన్

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

రాజధాని అమరావతి మీదుగా నిర్మించనున్న ఎర్రుపాలెం నంబూరు రైల్వే లైన్ ఎలైన్మెంట్ లో స్వల్ప మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కారణంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయని, తాడికొండ సమీపంలో అమరావతి ప్రధాన రైల్వే స్టేషన్ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. తాజా మార్పులతో ఈ రైల్వే లైన్ పొడవు యాభై ఎనిమిది కిలోమీటర్లకు పెరిగిందని, కొప్పురావూరు వద్ద మెగా కోచ్ టెర్మినల్ ఏర్పాటుకు సీఆర్డీఏను రెండు వందల ముప్ పై ఎకరాలు కేటాయించాలని కోరినట్లు అధికారులు స్పష్టం చేశారు.