పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక!
రిపోర్టర్: సునీల్
స్థలం: కాకినాడ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది మహిళలకు శ్రావణ మాస కానుకగా చీరెలు, పసుపు, కుంకుమ అందజేశారు. స్థానిక శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహించి, భక్తులకు ఉచితంగా పూజా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.