తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదకర మరణాలు
రిపోర్టర్: హరి
స్థలం: Telangana
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జన వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపాయి. నల్గొండ జిల్లా తిరుమలగిరి, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, కర్నూలు రూరల్ మండలం ఇ.తాండ్రపాడు, నంద్యాల జిల్లా డోన్, శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి, అనంతపురం జిల్లా గుత్తిలలో నిమజ్జన శోభాయాత్రల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రాము, కాకర్లమూడి ఈసు, శివమ్మ, గణేశ్ గౌడ్, శ్రీకాంత్, అశోక్ కుమార్ లు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.