మారుతున్న కాలంలో న్యాయవ్యవస్థకు రాజ్యాంగమే మార్గదర్శకం కావాలని సీజేఐ సూర్యకాంత్ స్పష్టత

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

సాంకేతికత మారినంత మాత్రాన రాజ్యాంగం కల్పించే గౌరవం, స్వేచ్ఛ మారబోవని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పష్టం చేశారు. దిల్లీ హైకోర్టు అరవయ్యవ వసంతాల వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఏఐ, డీప్ఫేక్స్ వంటి నూతన సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో చట్టాల పుస్తకాల్లో సమాధానాలు దొరకవని పేర్కొన్నారు. అలాంటి సంక్లిష్ట సమస్యలకు రాజ్యాంగాన్ని దిక్సూచిగా తీసుకుని పరిష్కారాలు వెతకాలని సీజేఐ సూచించారు. దేశంలో ఇతర హైకోర్టులతో పోలిస్తే దిల్లీ హైకోర్టు ఎంతో మెరుగైన సేవలందిస్తోందని అభినందించారు.