యలహంక భూమి షర్మిలదేనంటూ విజయమ్మ ప్రకటన: సోషల్ మీడియాలో వైరల్

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

బెంగళూరులోని యలహంక భూమి తన కుమార్తె షర్మిలదేనని, సరస్వతి సిమెంట్తో పాటు ఎంవోయూలో లేని ఆ ఆస్తి కూడా ఆమెకే చెందుతుందని వైఎస్సార్ సతీమణి విజయమ్మ స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చిలో నోటరీ చేయించి విడుదల చేసిన ఈ బహిరంగ ప్రకటన తాజాగా తెరపైకి వచ్చి వైరల్ అవుతోంది. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశాడని తల్లిగా ఆశిస్తున్నానని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.