బాలుడి తల్లి మౌలాబీ ఆత్మహత్య దురదృష్టకరం: ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో న్యాయం కోరుతూ ఆత్మహత్య చేసుకున్న బాలుడి తల్లి మౌలాబీ మృతి దురదృష్టకరమని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసు శాఖ దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా సాగిందని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోచింగ్‌ సెంటర్‌ అనుమతులను డీఈవో రద్దు చేశారు.