ప్రైవేట్ పాఠశాలలు కాలి బూడిద కావాలి: నటుడు జానీ ఫ్లిన్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
బ్రిటిష్ నటుడు జానీ ఫ్లిన్ తన బాల్యంలో ఎదుర్కొన్న బోర్డింగ్ స్కూల్ అనుభవాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు పూర్తిగా కాలి బూడిద కావాలని, అవి మనుగడలో ఉండకూడదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల తాను మానసిక క్షోభ అనుభవించానని, థెరపీ ద్వారా దాని నుంచి కోలుకున్నానని తెలిపారు. హెచ్‌బిఓ రూపొందిస్తున్న హ్యారీ పోర్టర్ సిరీస్‌లో ఆయన లూసియస్ మాల్‌ఫాయ్ పాత్రలో కనిపించనున్నారు.