రిటైర్డ్ ఐఏఎస్ కృపానందంపై విచారణకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

మనీలాండరింగ్ కేసులో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ బి.కృపానందంపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు జీఓ 223 జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. భారతి సిమెంట్స్ వ్యవహారంలో కృపానందాన్ని ఈడీ 18వ నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో, ఈడీ జాయింట్ డైరెక్టర్ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం పీఎంఎల్ఏ చట్టం ప్రకారం విచారణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.