కుప్పంలో రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: చిత్తూరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సోమవారం రాత్రి రెండు రైళ్ల హాల్ట్‌లను లాంఛనంగా ప్రారంభించారు. దాదర్-పుదుచ్చేరి మరియు వాస్కోడగామ-వేళంగిణి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కుప్పంలో హాల్ట్ కల్పిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కుప్పం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.