పోలీసుల తీరుపై విప్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: కృష్ణా జిల్లా
గన్నవరంలో పోలీసుల తీరుపై విప్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రొటోకాల్ పాటించకుండా, డబ్బులు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ సీఐ శివప్రసాద్‌ను నిలదీశారు. కోడిపందేలు, గణేష్ ఉత్సవాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చిక్కవరంలో పిల్లల మృతి ఘటనపై కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహారశైలిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు హెచ్చరించారు.